చిన్న శంకరంపేట మండలం సురారం గ్రామంలో 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను సర్పంచ్ మల్కాని నీరాజ పవన్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ విఆర్ఓ వెంకటేష్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, నాయకులు పవన్ గౌడ్, ముత్యాలు, విట్టల్, గ్రామ యువకులు పాల్గొన్నారు.