దుబ్బాక: రైతన్నలకు ఇబ్బంది కలిగించవద్దు
దుబ్బాక నియోజకవర్గం తోగుట మండలం ఎల్లారెడ్డి పేట గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. తేమ శాతం ఎక్కువ ఉందన్న నేపంతో రైతన్నలకు ఇబ్బంది కలిగించొద్దని, పత్తి కొనుగోలు కేంద్రానికి ఇన్చార్జ్ వ్యవహరిస్తున్న సీసీఐ అధికారులకు మెదక్ ఎంపీ విజ్ఞప్తి చేశారు. రైతన్నలను చైతన్యవంతులను చేయమన్నారు.