మెదక్ జిల్లా తపస్ మహిళా కార్యదర్శి బాన్సువాడ సంతోష
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మెదక్ జిల్లా మహిళా కార్యదర్శిగా బాన్సువాడ సంతోష ఎన్నికైనట్లు మెదక్ జిల్లా మహిళా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వరూప రాణి, సుజాత మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా సంతోష మాట్లాడుతూ జిల్లాలో తపస్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని, సంఘము యొక్క రాష్ట్ర, జిల్లా శాఖ ఆదేశాలను పాటిస్తూ, ఉపాధ్యాయులకు, విద్యారంగానికి అవసరమైన సేవలు అందిస్తానని తెలియజేశారు.