సంగారెడ్డి: రేపు ప్రజావాణి కార్యక్రమం
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 25వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.