చిలిపిచెడ్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో దసరా సందడి కనిపిస్తుంది. శనివారం తెల్లవారుజాము నుండి దేవాలయాల దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. అమ్మవారి సంబరాలలో చివరి రోజు కావడంతో ఫైజాబాద్ హనుమాన్ దేవాలయం వద్ద అమ్మవారు మహిషాసుర మర్ధినిగా దర్శనం ఇచ్చారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవాలయాలకు భక్తుల తాకిడి ప్రారంభమైంది.