మహానీయుల సేవలు మరవలేం

60చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై లింగం జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ జాన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసి సంబరాలు నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బారిన మహనీయుల సేవలు మరువలేనివని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్