పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి

65చూసినవారు
పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 4వ వార్డ్ కు చెందిన నర్సింగ్ కూతురు సహస్ర 7 సంవత్సరాల పాప తీవ్ర జ్వరం రావడం వల్ల శనివారం నాడు మరణించింది. ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్