ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పనుల పరిశీలన
నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి పురపాలక సంఘం చైర్మన్ అశోక్ గౌడ్ తో కలిసి నర్సాపూర్ పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా 8వ వార్డు యందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు సర్వే పనులు పరిశీలించారు. అనంతరము వార్డులోని అంగన్వాడీ కేంద్రం యందు పిల్లలకు గర్భిణీలకు అందుతున్న పౌష్టికాహారము తనిఖీ చేశారు.