సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువులో గుర్రపు డెక్క తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును గురువారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ భారీ వర్షంతో 60 శాతం గుర్రపు డెక్క తొలగిందని చెప్పారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.