దసరా పండుగకు ఊరికి వెళ్తున్న వారు భద్రంగా ఉండాలని ఎస్పి రూపేష్ మంగళవారం తెలిపారు. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే బ్యాంకు లకరులో భద్రపరుచుకోవాలని పేర్కొన్నారు. ఊరికి వెళ్లే సమయంలో ఇంటిని గమనించాలని పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. సీసీ కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేసుకొని మొబైల్ నుంచి ఇంటిని ప్రత్యక్షంగా చూసుకోవాలని సూచించారు. పోలీసుల నిబంధనలు పాటించాలని చెప్పారు.