సంగారెడ్డి లో వర్షం.. రోడ్లన్నీ జలమయం

4269చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో సోమవారం భారీ వర్షం కురిసింది. రెండు గంటలకు పైగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం మయ్యాయి. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు.

సంబంధిత పోస్ట్