సంగారెడ్డి జిల్లా ఎస్పీ, జహిరాబాద్ డిఎస్పి ఆదేశం మేరకు జహీరాబాద్ గ్రామీణ వలయాధిపరి (సీఐ) మహమ్మద్ మైనుద్దీన్, స్థానిక ఎస్ఐ రాము నాయుడు, రాయికోడ్, ఝరాసంఘం ఎస్ఐలతో శుక్రవారం రాత్రి 9 గంటల నుండి శనివారం ఉదయం వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పదుల సంఖ్యలో వాహనాలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని ఎనిమిది వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆరు వాహనాలకు జరిమాన విధించినట్లు పోలీసులు శనివారం ఉదయం తెలిపారు.