జహీరాబాద్: ఇళ్లస్థలాల దరఖాస్తు గడువు పెంపు
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు గడువు ఈనెల 20వ తేదీ వరకు పెంచినట్లు టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులు ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమ కోసం సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు.