మేడారం మహాజాతర.. మండమెలిగే పండుగతో ప్రారంభం

84చూసినవారు
మేడారం మహాజాతర.. మండమెలిగే పండుగతో ప్రారంభం
మేడారం మహాజాతరకు అంకురార్పణలో ప్రధాన ఘట్టం మండమెలిగే పండుగ ప్రారంభం అయ్యింది. సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు గుడుల వద్ద పూజారులు శుద్ది చేయడంతో పండుగ ప్రారంభమైంది. పుట్టమట్టితో గుడులు అలికి, మామిడి తోరణాలతో అలంకరణ చేశారు. ఈ మేరకు ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్