బీజేపీలో BRS విలీనం శుద్ధ అబద్ధం: ఈటల

64చూసినవారు
బీజేపీలో BRS విలీనం శుద్ధ అబద్ధం: ఈటల
బీజేపీలో BRS విలీనం అంశంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో BRS విలీనం అనేది శుద్ధ అబద్ధమన్నారు. బీజేపీలో అలాంటి చర్చ లేదని తెలిపారు. BRS నేతలు ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో.. దాన్ని బట్టి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉండొచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని మమ అనిపించిందని… పూర్తి స్థాయిలో రుణమాఫీ ఈ ప్రభుత్వం చేయలేదన్నారు. హైడ్రా పేరుతో అడ్డగోలుగా కూల్చివేతలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్