ట్రంప్‌ ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్లపై ఆంక్షలు ఎత్తేసిన మెటా

52చూసినవారు
ట్రంప్‌ ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్లపై ఆంక్షలు ఎత్తేసిన మెటా
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతాలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మెటా తెలిపింది. 2021లో క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం విధించారు. అనంతరం 2023లో వాటిని పునరుద్ధరించారు. అయితే భవిష్యత్తులో ట్రంప్ మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధిస్తామని మెటా పేర్కొంది.

సంబంధిత పోస్ట్