పురుషుడి వృషణాలతో పాటు వీర్యంలోనూ బయటపడ్డ మైక్రోప్లాస్టిక్ రేణువులు తాజాగా పురుషాంగంలోని కణజాలంలోనూ కనిపించాయి. గత ఆగస్టు, సెప్టెంబర్లో మియామీ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. పురుషాంగం కణజాలంలో మైక్రోప్లాస్టిక్ ఉనికి కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు కలుగొచ్చని పేర్కొన్నారు. అయితే, అంగస్తంభనలపై ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలియాల్సి ఉన్నదని వెల్లడించారు.