2030 నాటికి కోటి మంది భారతీయులకు కృత్రిమ మేధపై సంస్థ తరఫున శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వెల్లదించారు. భారత్‌లో క్లౌడ్ సేవలు, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణకు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. కృత్రిమ మేధ సాంకేతికతలో భారత్‌ను ఉన్నతస్థానంలో నిలిపేందుకు తాము కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు ఏఐ ప్రయోజనాలను పొందేలా చూడాలన్నది తమ ఆకాంక్షగా వివరించారు.