తమలపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రేగు కదలికలను సున్నితంగా పెంచుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలకు తమలపాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.