మాజీమంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను BRS నేత హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 'వాళ్లు మిమ్మల్ని వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారంటే, పాలిటికల్ గా ఆర్గ్యుమెంట్లు లేవని అర్థం- మార్గరెట్ థాచెర్' అనే కోట్ ను ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు కేటీఆర్ ను సురేఖ తిట్టడం తప్పుకాదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. KTR వెంటనే సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.