TG: SLBC ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ వాగ్వాదానికి దిగారు. టన్నెల్ వద్ద రిస్క్యూ ఆపరేషన్, తదితర విషయాలను మీడియా అక్కడే ఉంటూ ఆరు రోజులుగా కవర్ చేస్తోంది. అయితే మీడియాను అధికారులు జేసీ కంపెనీ కార్యాలయం గేటు వద్దకు బలవంతంగా పంపించేశారు. మంత్రి తీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే టన్నెల్‌లో జరిగిన వాస్తవాలు బయటకు వస్తాయనే మీడియాను బయటకు నెట్టివేశారని తెలుస్తోంది.