మంత్రి ఉత్త‌మ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. స‌న్న‌బియ్యం పంపిణీ అప్పుడే!

76చూసినవారు
TG: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామసభలో పాల్గొన్న మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కీల‌క ప్ర‌క‌టన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. "ఈ గ్రామసభల్లో 4 పథకాలకు ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మ‌య్యాయి. అప్లికేష‌న్‌లు ఇవ్వని వారు మళ్లీ ఇవ్వొచ్చు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డు ప్రక్రియ పూర్తి కాగానే 6 కిలోల సన్న బియ్యం అందజేస్తాం. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది" అని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్