TG: ఆదిలాబాద్‌లోని గుడిహత్నూర్ మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేశాడు. 3 గంటలపాటు బాలిక చేతులు, కాళ్లు కట్టేసి తన ఇంట్లోనే బంధించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా.. పోశెట్టి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే బాలికను రక్షించారు. ఈ ఘటనతో బాలిక బంధువులు నిందితుడికి దేహశుద్ది చేసి, అతని ఇంటికి నిప్పు పెట్టారు.