పోషక పదార్థాలు మెండుగా ఉండే మినుములకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.ఈ నేపథ్యంలో ఆరుతడి, పప్పుదినుసుల్లో ఒకటైన మినుము సాగుపై పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు.పంట వేసిన 90రోజుల వ్యవధిలో పంట చేతికి వస్తుంది.క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.6,300 ఉండగా ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6,500కు పైగా ధర పలుకుతుంది. ఈ క్రమంలో మినుము సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.