పాదాల కింద భాగం అకస్మాత్తుగా ఉబ్బిన్నట్లైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. తీవ్రమైన గుండె నొప్పి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు తరచుగా పాదాలు వాపు వస్తాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ల విలువల్లో తేడాలు వచ్చినప్పుడు కాళ్లు వాచే అవకాశం ఉంటుంది. ఎలాంటి శ్రమ చేయకుండా మడమలు పగుళ్లు ఏర్పడితే, విటమిన్ బి3, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉండవచ్చు.