మిస్‌ ఏఐగా మొరాకో సుందరి కెంజాలేలి

64చూసినవారు
మిస్‌ ఏఐగా మొరాకో సుందరి కెంజాలేలి
ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ‘మిస్‌ ఏఐ’ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ కెంజాలేలి విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది. 1500 మంది కంప్యూటర్‌ మాడిఫైడ్‌ మోడళ్లను వెనక్కి నెట్టి తొలి వర్చువల్‌ అందాల పోటీ విజేతగా నిలిచింది. మానవుల్ల్లా తనకు భావోద్వేగాలు తెలియనప్పటికీ విజయం సాధించినందుకు ఉత్సాహంగా ఉందని కెంజాలేలి పేర్కొన్నది. విజేతగా నిలిచిన ఆమెకు 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్