రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇందుకోసం పట్టా భూముల్లో యజమానికి టన్నుకు రూ.66 చెల్లించాలని నిర్ణయించింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 11 నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకునేలా ప్రభుత్వం పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఇసుక డిమాండ్ తక్కువగా ఉంది. నవంబర్, డిసెంబర్‌లో ఇసుక ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.