ప్రముఖ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యామినీ కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారన్న వార్త తెలిసి తను ఎంతో బాధపడ్డానని పేర్కొన్నారు. భారత శాస్త్రీయ నృత్యంలో ఆమె ప్రావీణ్యం, కళపై ఆమెకున్న అంకితభావం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.