ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందిన అమానవీయ సంఘటనలు మణిపూర్లో జరిగినా ప్రధాని మోడీ ఇంతవరకూ మణిపూర్ని సందర్శించలేదు. బాధితులను పరామర్శించలేదు. ప్రతిపక్షాలు పెద్దపెట్టున పార్లమెంటులో నినదించినా, నిరసన వ్యక్తం చేసినా మణిపూర్ పరిస్థితులను మెరుగుపర్చటానికి నిర్దిష్ట కార్యాచరణకు పూనుకోలేదు. గతేడాది మే నాటి దమనకాండ కారణంగా సర్వం కోల్పోయిన వేలాదిమంది ఇప్పటికీ సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. యువత చదువులను సగంలోనే వదిలేశారు.