AP: సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో వైఎస్సార్ కడపను కడప జిల్లా మార్చాలంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. కలియుగదైవం వెంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలిగడప కడప అని, అలాంటి పేరుకు ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని లేఖలో మంత్రి రాసుకొచ్చారు. ప్రజల మనోభావాల మేరకు పేరును గెజిట్‌లో మార్పులు చేసి గతంలో జరిగిన తప్పును సరిదిద్దాలని కోరారు.