తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి పదవులు శాశ్వతం కాదు అనేది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. సీఎం రేవంత్.. సద్ధాం హుస్సేన్‌లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే అంటూ ధ్వజమెత్తారు. నేనే కనుక అల్లు అర్జున్ అయితే బాధితల కుటుంబానికి రూ.300 కోట్లు ఇచ్చే వాడిని అని తెలిపారు.