TS: నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి పాములను చంపేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఉప్పునుంతల మండలంలో ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే అక్కడున్న రెండు పాములను చంపేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలాగే స్నేక్ క్యాచర్ సుమన్‌ను సంప్రదించగా ఆ పాములను పరిశీలించి అతను అవి విష సర్పాలు కాదని తేల్చాడు.