శ్రీలంక పర్యటన అనంతరం స్వస్థలమైన హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్.. తన కుటుంబ సభ్యుల కోసం రూ. 3 కోట్ల విలువ చేసే ల్యాండ్ రోవర్ కారు కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సిరాజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇప్పటికే సిరాజ్ దగ్గర టయోటా ఫార్చునర్ (రూ. 40 లక్షలు), బీఎండబ్ల్యూ 5 సిరీస్-రూ. 75 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ క్లాస్-(రూ. 1.86 కోట్లు), రేంజ్ రోవర్ వాగ్యూ-రూ. 2.8తో పాటు మహీంద్ర థార్ కార్లు ఉన్నాయి.