వయనాడ్‌ సహాయక చర్యల్లో పాల్గొన్న మోహన్‌లాల్‌

63చూసినవారు
వయనాడ్‌ సహాయక చర్యల్లో హీరో మోహన్‌లాల్‌ పాల్గొన్నారు. శనివారం ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించారు. కోజికోడ్‌ నుంచి రోడ్‌ మార్గంలో వయనాడ్‌కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆచూకీ గల్లంతైనవారిని గుర్తించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్