నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఎంత పెద్ద క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో నాలుగవ చిత్రం రాబోతోంది. ‘BB4' టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ పూజా కార్యక్రమాలను రేపు ఉదయం 9:00 గంటలకు రామానాయుడు స్టూడియోలో నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను రామ్ అచంట, గోపీ అచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.