'ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్య'గా మంకీపాక్స్ : డబ్ల్యూహెచ్ఓ

1551చూసినవారు
'ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్య'గా మంకీపాక్స్ : డబ్ల్యూహెచ్ఓ
వైరల్ వ్యాధి ‘మంకీ పాక్స్’ (mpox)‌ను ‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్య’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) బుధవారం ప్రకటించింది. గత రెండేళ్లలో ఈవిధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. తొలుత డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడిన ఈ వ్యాధి, తర్వాత ఆఫ్రికా దేశాలలో శరవేగంగా వ్యాపించింది. దీని వల్ల గర్భిణులు, పిల్లలకు రిస్క్ ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటివరకు 13 దేశాలలో మంకీ పాక్స్ కేసులను పెద్దసంఖ్యలో గుర్తించారు.

సంబంధిత పోస్ట్