11 వందల క్వింటాళ్ల విలువ చేసే చెక్కరను కోతులు తినేశాయని అధికారులు చెప్పిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. అలీఘర్‌లో ఉన్న బందర్ సాథ షుగర్ మిల్లులో 30 రోజుల్లోనే రూ.35 లక్షల విలువైన 11 వందల క్వింటాళ్లకు పైగా చక్కెర మాయమైంది. అయితే కోతులు తినేయడమే దీనికి కారణం అని షుగర్ మిల్స్ లిమిటెడ్ ఆడిట్ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ కుంభకోణంలో మేనేజర్, అకౌంట్స్ అధికారి సహా ఆరుగురిని దోషులుగా ఉన్నతాధికారులు నిర్ధారించారు.