గత BRS ప్రభుత్వంపై శుక్రవారం కాంగ్రెస్ నేత, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'వాళ్లు(BRS) చేయాలనుకున్న ప్రాజెక్టునే మేం చేస్తుంటే కూడా అడ్డుపడుతున్నారు.. సిగ్గు శరం ఉండాలే. మూసీ ప్రక్షాళన అనేది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానిని కొనసాగించి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. ఆరు గ్యారంటీలను అమలు చేసి దాంతో పాటే ప్రజలకు ఇంకేం కావాలో అవి కూడా అమలు చేస్తాం' అని అన్నారు.