ఎక్కువగా సంపన్నులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు: హైడ్రా రంగనాథ్‌

58చూసినవారు
ఎక్కువగా సంపన్నులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు: హైడ్రా రంగనాథ్‌
ఎక్కువగా సంపన్నులే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన అర్బన్ బయోడైవర్సిటీ జాతీయ సదస్సుకు రంగనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 'ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదల కంటే ధనికులే ఎక్కువగా ఉన్నారు. ఆక్రమణల్లో అన్ని రాజకీయ పార్టీల వారు ఉన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం.' అని రంగనాథ్ అన్నారు.

సంబంధిత పోస్ట్