దొంగలతో వీరోచితంగా పోరాడిన తల్లి, కూతురు(వీడియో)

1072చూసినవారు
HYD బేగంపేటలో తల్లీకూతురు తుపాకులకు ఎదురునిలిచి దొంగలతో వీరోచితంగా పోరాడారు. ఇద్దరు ఆగంతకులు నాటు తుపాకీతో ఓ ఇంట్లోకి చొరబడి దోచుకోవాలని చూశారు. కానీ ఆ ఇంట్లోని తల్లీకూతురు ఆ దొంగలను ధైర్యంగా ఎదిరించారు. ఓ దొంగను కింద పడేసి కొట్టి, చేతిలోని తుపాకీని లాక్కున్నారు. దాంతో అతడు భయంతో పారిపోయాడు. మరో దొంగ కూడా కొద్దిసేపటికి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్