బిడ్డతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం (వీడియో)

420519చూసినవారు
బెంగళూరు వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో 37 ఏళ్ల మహిళ తన ఐదేళ్ల బిడ్డతో సహా గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో గ్యాస్ లీక్ చేసి చనిపోవాలని ప్రయత్నించింది. అపార్ట్‌మెంట్ నుంచి గ్యాస్ వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు అధికారులకు విషయాన్ని తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి తలుపులు పగులగొట్టారు. చివరి నిమిషంలో తల్లి, బిడ్డను కాపాడారు. ఆత్మహత్యాయత్నానికి కారణం తెలియలేదు.

సంబంధిత పోస్ట్