బాలికకు తల్లి చిత్రహింసలు (వీడియో)

367674చూసినవారు
దత్తత తీసుకున్న బాలిక పట్ల ఓ మహిళ క్రూరంగా ప్రవర్తించింది. బాలికను దారుణంగా కొట్టి, చిత్రహింసలు పెట్టింది. అంతేకాకుండా పదునైన ఆయుధంతో చిన్నారి మెడపై ఆమె దాడి చేసింది. ఈ ఘటన యూపీలోని ఖుషీనగర్ జిల్లా కుబేర్‌స్థాన్ పోలీస్ స్టేషన్‌లోని సెమ్రా లక్ష్మీపూర్ గ్రామంలో ఇటీవల జరిగింది. చిన్నారిపై మహిళ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ మహిళపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్