టర్కీ పార్లమెంట్లో ఎంపీలు దారుణంగా గొడవపడ్డారు. రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. రక్తస్రావం అవడం వల్ల పార్లమెంట్‌లోని ఫ్లోర్‌పై రక్తపు మరకలు పడ్డాయి. జైలుకి వెళ్లొచ్చిన సభ్యుడి సభ్యత్వాన్ని పునరుద్ధరించేందుకు ఓటింగ్ జరిగింది. ఈ సమయంలోనే ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అధికార పక్షానికి చెందిన ఎంపీలు ఒక్కసారిగా మీద ప్రతిపక్ష నేతపై పడ్డారు. గట్టిగా కొట్టారు.