వినూత్న వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జేమ్స్ స్టీఫెన్) 100 ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇచ్చారు. జమైకా, అర్జెంటీనా, మెక్సికో, కొలంబో వంటి దేశాల్లో పేదలను గుర్తించి వారిని సర్ ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన యూట్యూబ్ లో పంచుకున్నారు. అయితే ఇలా చేయడం ద్వారా తాను వారి నుంచి ఎలాంటి ప్రయోజనం ఆశించడం లేదని తనకు నచ్చింది చేస్తున్నానని బీస్ట్ తెలిపారు.