హీరోయిన్ సౌందర్యది హత్య అని, ఆమెతో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు భూ వివాదాలు ఉన్నాయని ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి PSలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సౌందర్య భర్త రఘు క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి భూ వివాదాలు లేవని తెలుపుతూ.. ఓ లేఖను విడుదల చేశారు. సౌందర్య మరణంపై వస్తున్నవి అన్ని తప్పుడు వార్తలే అని, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని రఘు ఆ లేఖలో పేర్కొన్నారు.