మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు.. విచారణ వాయిదా

66చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు.. విచారణ వాయిదా
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర డ్రోన్ ఎగరవేసినందుకు గతంలో కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిషిద్ధ ప్రాంత జాబితాలో ఉందని పీపీ తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్