ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ భయానక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిరుతపులి నెమ్మదిగా నడుస్తూ ఓ ఇంట్లో నిద్రిస్తున్న కుక్కపై దాడి చేస్తుంది. ఆ సమయంలో యజమాని తన పెంపుడు కుక్క పక్కనున్న మంచం మీద పడుకుని ఫోన్‌లో మునిగిపోయాడు. అదృష్టవశాత్తు చిరుతపులి అతన్ని ఏమి చేయలేదు. ఈ ఘటన పూణెలోని భోర్ తాలూకాలోని దేగావ్ గ్రామంలో చోటుచేసుకుంది.