"జీవితంలో కేవలం విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకోవడమే కాదు.. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కఠినంగా శ్రమించేందుకు ముందడుగు వేయాలి. సక్సెస్‌తో సంబంధం లేకుండా కష్టపడాలి. నావరకైతే అదే అసలైన గేమ్. ఇదంతా దేవుడి పరీక్షగా భావించాలి. ఉన్నతస్థాయిలో కష్టపడకపోతే.. వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేం’’ అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ వెల్లడించాడు.