నా కల 50 శాతం నెరవేరింది: నితీశ్

65చూసినవారు
నా కల 50 శాతం నెరవేరింది: నితీశ్
భారత జట్టుకు ఎంపికవడంతో తన కల 50 శాతం నెరవేరిందని తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇండియన్ జెర్సీ ధరించి జట్టుకు విజయాలను అందించినప్పుడే తన కల పూర్తిగా నెరవేరుతుందని తెలిపారు. తన కెరీర్ కోసం ఎంతో కష్టపడ్డ తండ్రి ముత్యాల రెడ్డిని గర్వపడేలా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. 2024 ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ తరఫున నితీశ్ 11 మ్యాచుల్లో 303 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్