వ్యాపారపరమైన ఒత్తడి తట్టుకోలేక ఇటీవల ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన కొవ్వూరు సాయిగణేష్ (39) ఓ ప్రముఖ లాడ్జీలో రూంలో సూసైడ్ చేసుకున్నాడు. అయితే చనిపోయే ముందు తన తండ్రి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినా తమకు న్యాయం చేయలేదని సాయి గణేష్ కూతరు ఆరోపిస్తుంది. వైజాగ్ పోలీసులు సోనోవిజన్ యజమాని భాస్కరమూర్తికి అనుకూలంగా పని చేస్తున్నారని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.